జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరి జిల్లా కలకోట్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగింది. అటవీ ప్రాంతంలోని ఉగ్రవాదులు దాక్కున్నారని ఇంటెలిజెన్స్ నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో ఆర్మీ ప్రత్యక బలగాలు, పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే బలగాలను చూసిన ఉగ్రవాదులు.. కాల్పులు జరిపారు. దీంతో బలగాలు సైతం కాల్పులకు దిగడంతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.
.ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. అటవీ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా భావిస్తున్నారు. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సిబ్బంది ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ప్రస్తుతం సమాచారం మేరకు ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు , ఇద్దరు ఆర్మీ జవాన్లు. మృతి చెందారు. మరో వైపు ఓ మేజర్ ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడ్డారు