మాలి – ఉగ్రవాదులు మాలిలో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ దేశ సైనిక స్థావరంతో పాటు ప్రయాణికులతో వెళ్తున్న పడవపై దాడికి పాల్పడ్డారు. ఉత్తర మాలిలో ఈ ఘటన జరగ్గా.. 64 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం మేరకు.. వేర్వేరు చోట్ల ఉన్న సైనిక స్థావరం, ప్రయాణికుల పడవపై దాడి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారు. తొలి ఉగ్రవాద దాడి నైజర్ నదిలో టింబక్టు పడవపై దాడి చేయగా.. ఆ తర్వాత బాంబాలోని సైనిక స్థావరపై దాడి చేశారు. రెండు దాడుల్లో మొత్తం 49 మంది పౌరులతో పాటు 15 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అల్‌ఖైదాకు చెందిన ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు సంబంధిత వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement