Tuesday, November 26, 2024

Terrorism – భద్రతా సిబ్బంది దుస్తుల్లో ఉగ్రవాదులు – ముగ్గురి కాల్చివేత

ఇంపాల్ – అల్లర్లతో అట్టుడికిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. నిన్న భద్రతా సిబ్బంది దుస్తుల్లో వచ్చిన దుండగులు తనిఖీల పేరుతో ఇంట్లో ఉన్న వారిని బయటకు పిలిచి ముగ్గురిని కాల్చి చంపారు

కంగ్పోకపీ, ఇంఫాల్ పశ్చిమ జిల్లాల సరిహద్దులోని ఖొకెన్ గ్రామంలో జరిగిందీ ఘటన. కాల్పుల శబ్దానికి సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న అస్సాం రైఫిల్స్ భద్రతా సిబ్బంది వెళ్లేసరికే దుండగులు పరారయ్యారు. వారి కోసం మణిపూర్ పోలీసులు, అస్సాం రైఫిల్స్, ఆర్మీ సిబ్బంది గాలిస్తున్నారు. నిందితులను మైతేయి సామాజిక వర్గానికి చెందిన వారిగా అనుమానిస్తున్నారు. కాగా, మణిపూర్లో మూడు నెలలుగా కొనసాగుతున్న హింసలో ఇప్పటి వరకు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు

Advertisement

తాజా వార్తలు

Advertisement