Sunday, November 3, 2024

Terror – జమ్మూలో బస్ పై ఉగ్ర దాడి – 10 కి చేరిన మృతుల సంఖ్య

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం సాయంత్రం రైసీ జిల్లాలో యాత్రీకులతో ప్రయాణం చేస్తున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు.

దీంతో బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించాగా, 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు యాత్రీకులతో శివ్‌ ఖోరి కేవ్‌ మందిరానికి వెళ్తుండగా ఈ దాడికి గురైంది. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడని, దీంతో బస్సు లోయలోకి పడిపోయిందని రైసీ సీనియర్‌ ఎస్‌పి మోహితా శర్మ తెలిపారు.

- Advertisement -

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు రంగంలోకి దిగి యాత్రీకులను రక్షించడానికి ప్రయత్నించారు. తరువాత పోలీసులు, ఆర్మీ, పారామిలటరీ దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సరిహద్దు జిల్లాలు రాజౌరీ, ఫూంచ్‌ జిల్లాతో పోలిస్తే రైసీ జిల్లాలో ఉగ్రవాద కార్యక్రమాలు తక్కువగా ఉంటాయి. ఇలాంటి జిల్లాలో ఉగ్రదాడి జరగడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు తెలిపారు. మృతుల్ని ఇంకా గుర్తించలేదని, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి, చికిత్స ఆందిస్తున్నామని రైసీ జిల్లా విశేష్‌ మహజన్‌ తెలిపారు..

రాజ్‌నాథ్ సింగ్ ఖండన

ఉగ్రదాడిని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు. యాత్రికులపై జరిగిన ఈ హేయమైన చర్యలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

ఉగ్రదాడిలో దోషులను వదిలిపెట్టరు: అమిత్ షా

జమ్మూకశ్మీర్‌లోని రియాసీలో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్నవారిని విడిచిపెట్టబోమని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. రెండోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, పరిస్థితిపై ఆరా తీయడానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా , డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ఆర్ స్వైన్‌తో మాట్లాడినట్లు అమిత్ షా చెప్పారు.జమ్మూకశ్మీర్‌లోని రియాసిలో యాత్రికులపై దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేస్తోందని షా అన్నారు. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, డీజీపీతో మాట్లాడి ఘటనపై సమాచారం తెలుసుకున్నారు.

ఈ పిరికిపంద దాడికి పాల్పడిన నిందితులను వదిలిపెట్టరు. తక్షణ వైద్య సదుపాయాలు అందించేందుకు స్థానిక యంత్రాంగం యుద్ధప్రాతిపదికన కృషి చేస్తుందన్నారు. మృతుల కుటుంబాలకు ఈ దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదిస్తానని అన్నారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

Advertisement

తాజా వార్తలు

Advertisement