ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని వైమానిక దళానికి చెందిన మియాన్‌వాలీ ట్రైనింగ్ ఎయిర్ బేస్‌పై ఉగ్రవాద దాడి జరిగింది. అయితే ఆ అటాక్‌ను తిప్పికొట్టారు. ఐదుగురు మిలిటెంట్లను పాక్ ఆర్మీ మట్టుబెట్టింది. మరో ముగ్గురు ఉగ్రవాదులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మూడు విమానాలు, ఫ్యూయల్ ట్యాంకర్ ధ్వంసమైనట్లు పాక్ మిలిటరీ పేర్కొన్నది.
ఉగ్రవాదుల దాడిలో భారీ నష్టమే జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎయిర్ బేస్‌కు ఎంటర్ అవుతున్న సమయంలో ఐదుగురు ఉగ్రవాదుల్ని షూట్ చేశామన్నారు. దేశం నుంచి ఉగ్రవాదుల్ని రూపుమాపేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు పాక్ మిలిటరీ తెలిపింది. శుక్రవారం రోజున ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలను టార్గెట్ చేశారు. రెండు వాహనాలపై జరిగిన దాడిలో.. 14 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. గదార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.