Monday, November 18, 2024

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోరం.. సుమ్లీ న‌దిలో ప‌డ‌వ బోల్తా, ముగ్గురు చిన్నారులు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో పడవ ప్రమాదం జరిగింది. సుమ్లీ నదిలో పడవ బోల్తా పడటంతో 30 మంది దాకా నీటిలో మునిగిపోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు చ‌నిపోయిన‌ట్టు తెలుస్తోంది. మ‌రో ఏడుగురిని బయటకు తీసి చికిత్స కోసం హాస్పిట‌ల్‌కి తరలించారు. కాగా, 20 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన‌ట్టు స‌మాచారం. మహ్మద్‌పూర్ ఖలా పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరానా మౌ మజారి గ్రామంలో నది ఒడ్డున ఏటా పౌర్ణమి నాడు గారంగ్‌ దేవ్‌ వద్ద నిర్వహించే కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు పడవలో సుమ్లీ నది దాటేందుకు బయల్దేరారు.

నది మధ్యకు రాగానే బోటు బ్యాలెన్స్ తప్పి బోల్తా కొట్టింది. దీంతో పడవలోని 30 మంది నీటిలో మునిగిపోయారు. కాగా, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ట్వీట్ ద్వారా మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement