Saturday, November 23, 2024

మహబూబాబాద్ లో ఉద్రిక్తత – ఇండ్లు తొలగిస్తున్న అధికారుల పై తిరగబడ్డ జనం

మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నూతన కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో నివసిస్తున్న పేదల ఇండ్లను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇవాళ ఉదయం తొలగించారు.

మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో 255/1 సర్వే నెంబర్ ప్రభుత్వ భూములు ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అక్కడకు వెళ్లారు. చూసిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు షాక్‌ తిన్నారు. ఆస్థలంలో డేరాలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. దీంతో వారి వద్దకు వెళ్లిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఇళ్లు తొలగించనున్నట్లు తెలిపారు. దీంతో అక్కడున్న వారందరూ ఏకమైన వారిపై తిరగబడ్డారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన వద్దకు పోలీసులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.

- Advertisement -

ఇళ్లను తీసివేస్తే మా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. మా పిల్లలతో మేము ఎక్కడికి వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇది ప్రభుత్వ స్థలమని ఇందులో నివసించడానికి అనుమతి లేదంటూ అధికారులు ఎంత నచ్చజెప్పిన వినకపోవడంతో గుడేసేవాసులను బలవంతంగా పోలీసులు నెట్టివేసి గుడిసెలు తొలగుంపు చర్యను మొదలు పెట్టారు. పేదలు వేసుకున్న గుడిసెలను జేసీబీల సహాయం పోలీసు బలగాలతో ఆధికారులు తొలగించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో గుడిసె వాసుల వాగ్వివాదం, తోపులాట చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఇక్కడి నుంచి వెనుతిరిగి పోవాలంటూ గుడిసేవాసుల ఆందోళన చేపట్టారు. జేసీబీ పై ఎక్కి నిరసన చేపట్టారు

Advertisement

తాజా వార్తలు

Advertisement