హైదరాబాద్, ఆంధ్రప్రభ: పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో హాల్టికెట్లను ఈరోజు నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 4,94,616 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.
ఇదిలా ఉంటే విద్యార్థులకు ఇచ్చే మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నపత్రం (బిట్ పేపర్)ను ఆఖరి 15 నిమిషాల్లోనే ఇవ్వాలని తెలిపింది. అంతేకాకుండా జనరల్ సైన్స్ పరీక్షల్లోని రెండు ప్రశ్నపత్రాలను ఒకేసారి కాకుండా నిర్ధేశించిన సమయానికి విద్యార్థులకు విడివిడిగా ఇవ్వాలని తెలిపింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లుగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.