ఏపీలో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పెంచింది. ఏప్రిల్ 15 వరకు పరీక్ష ఫీజు గడువు పెంచినట్లు అధికారులు వెల్లడించారు. రూ.50 ఫైన్‌తో ఈ నెల 22 వరకు, రూ.200 ఫైన్‌తో 29 వరకు, రూ.500 ఫైన్‌తో మే 6వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలియజేశారు. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కాగా పట్టణాల్లో ఏడాదికి రూ.24వేలు, గ్రామాల్లో రూ.20వేల ఆదాయం, మాగాణి 2.5 ఎకరాలు, మెట్ట 5 ఎకరాల్లోపు ఉన్న వారికి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement