మోహన్ బాబు ఇంటిదగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు మూడు రోజులుగా మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇద్దరూ పరస్పర పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చుకున్నారు. అయితే, తాజాగా జల్ పల్లి లోని నివాసానికి మంచు మనోజ్, మౌనిక చేరుకున్నారు. ఇక లోపలికి వెళ్లాలని ప్రయత్నించగా… మంచు విష్ను ఏర్పాటు చేసిన ప్రైవేటు బౌన్సర్లు గేట్లు ఓపెన్ చేయలేదు. లోపల తమ 7 నెలల కూతురు ఉందని, వెళ్ళాలి అంటూ మనోజ్ కారు దిగి మరీ సెక్యూరిటీని అభ్యర్థించారు.
ఇక ఎంతసేపటికి మోహన్ బాబు సిబ్బంది గేట్స్ ఓపెన్ చేయకపోయేసరికి.. మనోజ్ తన బౌన్సర్స్ తో కలిసి గేట్స్ బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయారు. దీంతో మహన్ బాబు రంగంలోకి దిగారు. అక్కడ ఉన్న మీడియా మిత్రులపై దౌర్జన్యం చేస్తూ కెమెరాలు పగలగొట్టేశారు. పోలీసులు రంగంలోకి దిగినా సరే అక్కడ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.