రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే షాకిచ్చింది. రైల్వే రిజర్వేషన్ సేవలను ఈనెల 21, 22 తేదీల్లో పలు సమయాల్లో తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టంలో డిజాస్టర్ రికవరీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని తెలిపింది. దానికోసం ఛార్టింగ్, కరెంట్ బుకింగ్, పీఆర్ఎస్ ఎంక్వయిరీ, టికెట్ రద్దు, ఛార్జీలు వాపస్ పొందడం లాంటి పీఆర్ఎస్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి.
ఈ నెల 21వ తేదీ రాత్రి 11:45 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు.. అదే విధంగా తిరిగి 22వ తేదీ రాత్రి 11:45 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు సేవలు నిలిచిపోతాయి. ఈ సమయంలో ప్రారంభం అయ్యే అన్ని రైళ్ల మెయిన్ ఛార్టులు, కరెంట్ బుకింగ్ ఛార్టులు ముందుగానే సిద్ధం చేయనున్నారు. కాబట్టి ఈ సమయంలో టికెట్ బుక్ చేసుకునే ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం బెటర్.
ఈ వార్త కూడా చదవండి: కరోనా అప్‌డేట్స్: మరోసారి 36 వేల కేసులు నమోదు