Tuesday, January 21, 2025

Maha kumbh | 12లక్షల మందికి తాత్కాలిక ఉపాధి

జనవరి 13న ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన మహాకుంభమేళాలో 12 లక్షల తాత్కాలిక ఉద్యోగాల సృష్టి జరిగిందని గ్లోబల్‌ టెక్నాలజీస్‌ అండ్‌ డిజిటల్‌ టాలెంట్‌ సొల్యూషన్స్‌ ప్రొవైడర్‌ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ అంచనా వేసింది. వివిధ రంగాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ సంస్థ ఈసీవో సచిన్‌ అలగ్‌ ఈ మేరకు గణాంకాలు విడుదల చేశారు.

సుప్రసిద్ధ ఆధ్యాత్మిక కార్యక్రమంతో ఉత్తరప్రదేశ్‌లో ఆర్థికవృద్ధి, తాత్కాలిక ఉపాధి కకల్పన జరుగుతుందని సచిన్‌ అభిప్రాయపడ్డారు. ఈ ప్రభావం పలు రంగాలపై కనిపిస్తుందన్నారు. పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనే దాదాపు 4.5 లక్షల మందికి ఉపాధి లభించివుండొచ్చని పేర్కొన్నారు.

హోటల్‌, టూర్‌ గైడ్‌, పోర్టర్లు, ట్రావెల్‌ కన్సల్టెంట్లు, ఈవెంట్‌ కోఆర్డినేటర్లుగా అనేక మందికి ఉపాధి లభిస్తున్నదని చెప్పారు. రవాణా అనుబంధ రంగాల్లో 3 లక్షల మందికి, తాత్కాలిక వైద్య శిబిరలాలో 1.5 లక్షల మందికి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. అదే సమయంలో 2 లక్షల మంది ఐటీరంగ నిపుణుల సేవలు మహాకుంభ మేళాలో అవసరం అవుతున్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement