కేరళలో ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తమిళనాడు నుంచి మున్నార్ వెళ్తున్న ఓ టెంపో ట్రావెలర్ లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
- Advertisement -
తమిళనాడు నుంచి మున్నార్ వెళ్తున్న టెంపో ట్రావెలర్ లోయలో పడింది. ఇడుక్కి జిల్లాలోని ఆదిమాలి మంకులం ప్రాంతంలో బోల్తా కొట్టి లోయలో పడింది టెంపుల్ ట్రావెలర్. ఈ సంఘటనలో ఏకంగా ముగ్గురు మృతి చెందారు. 15 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.