Thursday, November 7, 2024

తొలి ఏకాదశికి ముస్తాబవుతున్న ఆలయాలు

(ప్రభ న్యూస్‌) : ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి ని తొలి ఏకాదశి అని అంటారు. ఈ తొలి ఏకాదశి ఈ నెల 10వ తేదీ ఆదివారం వస్తోంది. విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భంగా ఇది తొలి ఏకాదశి అని పరిగణిస్తారు. రేపు (ఆదివారం) తొలి ఏకాదశి పర్వదినం కావడంతో జంట నగరాలలో పలు ప్రాంతాల్లో ఉన్న వైష్ణవ ఆలయాలు అందంగా ముస్తాబవుతున్నాయి. భక్తులకు ఇబ్బందులు పడకుండా ఆయా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆలయాలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి రావాలని కఠిన నిబంధనలు పలు ఆలయాల అధికారులు అమలు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement