Friday, November 22, 2024

ల‌క్ష‌ల ఎక‌రాలు అన్యాక్రాంతం..

దేవుడి భూములకు రక్షణ కరువు!
ఆస్తులున్నా ఆదాయం సున్నా
సహకరిస్తున్న అధికారులు
దాతల ఆశయానికి గండి
ఆవేదన వ్యక్తం చేస్తున్న భక్తులు

అమరావతి,ఆంధ్రప్రభ: వేల కొద్దీ ఎకరాల భూములు.. ఆదాయం చూస్తే అంతంత మాత్రమే. మరో వైపు ఆలయాలు, సత్రం భూములు కొట్టేసేందుకు ఘరానా ముఠాల ప్రయత్నాలు..ఇందుకు అధికారుల సహకారం..వెరసి వేలాది ఎకరాలున్న ఆలయాలు నిత్య ధీపదూప నైవేద్యాలకు కూడా నోచుకోకుంటే..సత్రాలు శిథిలావస్థకు చేరుకొని కునారిల్లుతున్నాయి. మరో వైపు అక్కడ పని చేసే ఉద్యోగులు జీతాలు ఎప్పడొస్తాయో తెలియని స్థితిలో నెలల తరబడి ఎదురు చూపులు చూడాల్సిన దుస్థితి దేవదాయశాఖలో నెలకొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆలయాలు, ట్రస్టులు, సత్రం భూముల అన్యాక్రాంతం వెనుక దేవదాయశాఖ అధికారులే ఉన్నట్లు ఇటీవల వెలుగు చూసిన విజయనగరం జిల్లా భోగాపురం మండలం గూడె పువలస గ్రామంలోని కొమ్మురు అప్పడు దొర ట్రస్టు భూముల వ్యవహారమే నిదర్శనం. పేద పిల్లల విద్యార్జనకు, వసతి సౌకర్యాల కల్పనకు నిర్థేశించిన ట్రస్టు భూములు అన్యాక్రాంతం అయ్యేందుకు అధికారురు సహకారంపై ఇటీవల ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసింది.

భోగాపురం విమానాశ్రయానికి కూతవేటు దూరంలోని కొమ్మురు అప్పడు దొర ట్రస్టుకు రూ.100 కోట్ల పైబడి విలువున్న 22.06 ఎకరాల భూములు ఉంటే..అందులో 3.06 ఎకరాలు తనవి అంటూ హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసరావు దరఖాస్తు చేసుకు న్నారు. ట్రస్టు ఆస్తుల రిజిస్టర్‌ పరిశీలించకుండానే విజయనగరం సహాయ కమిషనర్‌ ఎమ్మార్వోకు లేఖ రాయడం, అక్కడ ఆ అధికారి పేర్కొన్న సర్వే నంబర్లలో దేవదాయ భూములు లేవంటూ నివేదిక రావడం..ఆ వెంటనే వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలం టూ దేవదాయ కమిషనరేట్‌కు దస్త్రం పంపడం..ఇలా అన్ని చకాచకా జరిగాయి. దేవదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు భూ రక్షణ సెల్‌ విభాగం అధికారి విజయరాజుజరిపిన విచార ణలో జిల్లా అధికా రుల నిర్వాకం బయటప డింది. తన భూమి అంటూ ముందు కొచ్చిన వ్యక్తి కేవ లం ఒక అర్జీ మినహా అందుకు సం బంధించి ఏ విధమైన ఆధారాలు సమర్పిం చకున్నా ఉద్దేశపూర్వ కంగానే అధికారులు అనుకూ లంగా వ్యవహరించినట్లు స్పష్టమైం ది. ఇదే తర హాలో రాష్ట్రం లోని పలు జిల్లాల్లో జరుగుతున్నట్లు ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి.

- Advertisement -

రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి, భక్తుల కు సౌకర్యాలు, అర్చకుల జీవనోపాధి తదితర అంశాలను దృష్టి లో ఉంచుకొని దాతలు వేలాది ఎకరాల భూ ములు ఆలయాలకు ఇచ్చారు. కొందరు స్పష్టమైన కారణాలతో ఏర్పాటు చేసిన ట్రస్టులు, సత్రాల నిర్వహణకు కూడా పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో రెండు లక్షల ఎకరాలకు పైగా భూములు అన్యాక్రాం తమయ్యాయి. మరికొన్ని కోర్టు వివా దాల్లో ఉన్నాయి. కొందరు భూము లను అనుభవిస్తూ కూడా లీజులు చెల్లించడం లేదు. కొంద రు రాజకీ య పలుకుబడిని అడ్డుపె ట్టు కొని లీజుల ఎగవేతకు పాల్పడు తుంటే.. మరికొం దరు రకర కాల కారణాలు సాకు గా చూపు తూ లీజుల చెల్లించడం లేదు. ఇందుకు ఎన్‌టీఆర్‌ జిల్లా వేదాద్రి ఆలయానికి చెందిన వేలాది ఎక రాల భూములకు ఏళ్ల తరబడి లీజు లు చెల్లించకపోవడమే నిదర్శనం. విజ యనగరంవంటి జిల్లాలో రూ.వెయ్యి కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఆలయాలు, సత్రాలు, ట్రస్టులకు ఉన్నప్పటికీ లీజుల రూపంలో వస్తున్న ఆదాయం అరకొర మాత్రమే. అధికారులు సైతం అన్యా క్రాంతం చేసిన వారికే ఒత్తాసు పలుకుతున్నారు తప్ప భూముల రక్షణకు తీసుకుంటున్న చర్యలు శూన్యమేనని చెప్పొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement