Saturday, November 23, 2024

దేవాదాయ ఆస్తులు, విగ్రహాలకు రక్షణ లేదు.. వైసీపీ హయాంలో అంతా దోపిడే: లోకేశ్​

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రకాశం జిల్లాలో వైకాపా నేత నివాసంలో రూ. 25 కోట్ల మరకత విగ్రహం బయటపడిన అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రంగా స్పందించారు. వైకాపా నేతలు ఊర్ల మేద పడుతూ గుడి, గుడిలో లింగాన్ని దోచుకుంటున్నారని సోమవారం మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. వైకాపా నేతలు వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో అంత విలువైన విగ్రహం బయటపడిందంటే ఇక మిగిలిన ఆ పార్టీ నేతల ఇళ్లల్లో ఇంకెన్ని పురాతన విగ్రహాలు ఉన్నాయో అని వ్యాఖ్యానించారు.

దేవాలయాల్లో నగలు, విగ్రహాలు వైకాపా నేతలు ఎత్తుకుపోతున్నార న్న అనుమానాలు భక్తుల్లో ఉన్నాయని అన్నారు. అంతర్వేది రథం దగ్ధం, దుర్గమ్మ వెండి సింహాలు మాయం, రామతీర్థం ఘటనలో ఇంత వరకు నిందితులు దొరకకపోగా ఇలా వెంకటేశ్వరరెడ్డి లాంటి వైకాపా నేతల దగ్గర విగ్రహాలు దొరుకుతున్నాయని లోకేష్‌ మండిపడ్డారు. దేవాలయాల ఆస్తులకు, దేవతల విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దేవాలయాల్లో తక్షణమే కేంద్ర బృం దాలు లేదా న్యాయ బృందాల పర్యవేక్షణలో ఆడిట్‌ నిర్వహించాలని లోకేష్‌ డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement