Friday, November 22, 2024

Weather | మరింత పెరగనున్న టెంపరేచర్లు.. తీవ్రంకానున్న వడగాలులు

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్స్ రానున్న‌ట్టు భారత వాతావారణ శాఖ (IMD) సూచనలను జారీ చేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రానున్న రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగే చాన్స్​ ఉందని భారత వాతావరణ శాఖ ఇవ్వాల (శుక్రవారం) తెలిపింది. ఒడిశాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వచ్చే ఐదు రోజుల్లో వేడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. మే 13-14 వరకు కేరళ, తమిళనాడులలో కూడా ఇలాంటి నమూనాలు అంచనా వేయబడ్డాయి.

ఎండవేడిమిని తట్టుకోలేక ప్రజలు ఎయిర్ కండిషనర్లు.. ఇతర వాటర్​ కూలింగ్​ పరికరాలను ఆన్​ చేస్తున్నారు. దీంతో అధిక ఉష్ణోగ్రతలు దేశంలో విద్యుత్ డిమాండ్‌ను పెంచే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. అలాగే IMD సూచన ప్రకారం, కొన్ని జోన్లు మినహా, దేశంలోని పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరాఖండ్, తమిళనాడు, కేరళ, కర్నాటక ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం కూడా ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement