Friday, November 22, 2024

Kashmir లో సున్నా డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు..

జమ్మూకాశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నాకు దిగువగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి మరింతగా పెరవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీనగర్‌లో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత -0.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

కాశ్మీర్‌లోని ఖాజిగుండ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత -2.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, పహల్గామ్‌లో -3.2 డిగ్రీల సెల్సియస్‌, షోపియాన్‌లో -3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నవంబర్‌ 23 వరకు కాశ్మీర్‌లో వాతావరణం సాధారణంగానే ఉంటు-ందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్‌ 24న వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని, లోయలోని ఎత్తయిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా తేలికపాటి మంచు కురిసే అవకాశమున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement