మార్చిలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పెరిగింది. అదేవిధంగా తేమ శాతం 55 డిగ్రీలు, కనిష్టంగా 43 డిగ్రీలు ఉంటుంది. ఉత్తర వాయువ్య దిశ నుండి వేడిగాలులు వీస్తుండటంతో ఎండ తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఏప్రిల్‌లో 45 డిగ్రీలకు పెరిగే అవకాశం ఉంది. గత ఏడాది అత్యధికంగా 45 డిగ్రీలు నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చెరుకు రసం, కలింగర, కర్బూజ పండ్ల దుకాణాల ముందు జనం క్యూ కడుతున్నారు. అలాగే కూలర్లు, ఏసీలకు డిమాండ్ పెరిగింది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఎండ తీవ్రతకు గురి కాకుండా, వడదెబ్బకు తీసుకోవా ల్సిన జాగ్రత్తలపై జల్లా విపత్తుల నిర్వహణ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ ఎన్ అవినాష్ జయసింహ ప్రత్యేకంగా వివరాలు వెల్లడించారు. తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం కలిగివుండటం, మత్తు నిద్ర, ఫిట్స్, పాక్షిక, పూర్తిగా అపస్మారక స్థితి ఉండటం, ప్రజలు నిత్యం స్థానిక వాతావరణ సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లిన సమయంలో రుమాలు కానీ, టోపీ కానీ ధరించాలి.
దాహం వేయకపోయినా తరచుగా నీళ్లు తాగాలి, ఉప్పు కలిపిన మజ్జిగ కానీ, గ్లూకోజ్, ఓఆర్‌ఎస్ కలిపిన నీటిని తాగవచ్చు. వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితి లేని పక్షంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలి. ఎండలో నుండి వచ్చిన వెంటనే నీరు కానీ, నిమ్మరసం కానీ, కొబ్బరి నీళ్లు కానీ తాగాలి. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరుగుట, వాంతులు ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఎండ తీవ్రత ఉన్నప్పుడు చేయకూడనవి ..
ఎండలో గొడుగు లేకుండా వెళ్లరాదు. వేసవికాలంలో నలుపురంగు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్దులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు, వీరిపై ఎండ ప్రభావం త్వరగా ఉంటుంది. జిల్లాలో రానున్న 48 గంటల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని డీపీఎం తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..