అగ్రరాజ్యంలో మరోసారి భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని మేరీలాండ్ లెప్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్ ప్రమాణస్వీకారం చేశారు. భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన తొలి ఇండియన్- అమెరికన్‌గా అరుణా మిల్లర్ అమెరికాలో చరిత్ర సృష్టించారు. నవంబర్‌లో జరిగిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో లెప్టిnనెంట్ గవర్నర్‌గా ఆమె విజయం సాధించారు.
అరుణ మేరీలాండ్ రాష్ట్రానికి 10వ లెప్టిnనెంట్ గవర్నర్. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెదపారుపూడి. వారి కుటుంబం చాలా ఏళ్ల క్రితం అమెరికా వలస వెళ్లింది. అరుణ తన కెరీర్‌ను ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీర్‌గా ప్రారంభించారు. ఆమె తండ్రి కాట్రగడ్డ వెంకట రామారావు ఐబీఎం సంస్థలో పని చేసేవారు. 1972లో వీరి కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడింది.
1972లోనే వీరి కుటుంబం అమెరికా వెళ్లి స్థిరపడింది. 2010 నుంచి 2018 వరకు మేరీలాండ్ హౌస్ ఆఫ్ డెలిగేట్స్‌లో రెండు పర్యాయాలు సభ్యురాలిగా అరుణ ఉన్నారు. అంచెలంచెలుగా ఎదిగి మేరీలాండ్ లెప్టిnనెంట్ గవర్నర్‌గా విజయం సాధించి చరిత్ర సృష్టించారు. అమెరికాలోని మిస్సోరి యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన అరుణ 1990లో అమెరికాకు చెందిన డేవిడ్ మిల్లర్‌ను వివాహం చేసుకున్నారు. అరుణా మిల్లర్ డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలిగా చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు.