ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సీఏ ఫైనల్ పరీక్షల ఫలితాల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. హైదరాబాద్, తిరుపతికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
నవంబర్‌లో నిర్వహించిన సీఏ ఫైనల్ పరీక్షల ఫలితాలను ఐసీఏఐ గురువారం అర్ధరాత్రి విడుదల చేసింది. విద్యార్థులు వారి రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా స్కోర్ కార్డ్‌లు, మెరిట్ జాబితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా, సీఏ ఫైనల్ పరీక్షలో గ్రూప్-1లో 16.8%, గ్రూప్-2లో 21.36% ఉత్తీర్ణత సాధించారు. రెండు గ్రూపుల్లో కలిపి 13.44 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఐసీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన హేరంబ్ మహేశ్వర్, తిరుపతికి చెందిన రిషబ్ ఓస్త్వాల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్‌లో నిలిచారు. వీరిద్దరూ 508 మార్కులతో (84.67%) టాప్ ర్యాంక్ సాధించారు. అలాగే, అహ్మదాబాద్‌కు చెందిన రియా కుంజన్‌కుమార్ షా 501 మార్కులతో రెండో ర్యాంకు, కోల్‌కతాకు చెందిన కింజల్ అజ్మీరా 493 మార్కులతో మూడో ర్యాంక్ సాధించారని ఐసీఏఐ వెల్లడించింది.