Friday, November 22, 2024

Delhi | స్వస్థలాలకు మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు.. ప్రత్యేక విమానాల్లో తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపడుతోంది. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో రెండు హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసి కంట్రోల్ రూం నుంచి సేకరించిన డేటాతో 160 మంది విద్యార్థుల ఆచూకీని ట్రాక్ చేశారు. మణిపూర్‌లోని ఎన్‌ఐటీ, ఐఐఐటీ, సెంట్రల్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు అదనపు విమానాల ఏర్పాటు కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఇతర అంశాల్లో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తున్నారు.

- Advertisement -

సోమవారం అర్థరాత్రి వేర్వేరు విమానాలలో 157 మంది విద్యార్థులు మణిపూర్ నుంచి హైదరాబాద్, కోల్‌కత్తా చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. మణిపూర్ నుంచి కోల్‌కత్తా చేరుకున్న విద్యార్థులకు సహాయమందించడానికి ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ నుంచి ఇద్దరు అధికారులు కోల్‌కత్తా విమానాశ్రయానికి వెళ్లారు. కోల్‌కత్తా నుంచి హైదరాబాద్ అక్కణ్నుంచి విద్యార్థులు తమ స్వస్థలాలకు వెళ్లడానికి ఏపీఎస్సార్టీసీ బస్సులను కూడా సిద్ధంగా ఉంచినట్టు ఏపీ భవన్ అధికారులు వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement