Friday, November 22, 2024

National : అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవికి న్యాయం జ‌ర‌గాల్సిందే…కేటీఆర్

అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందులను తన వాహనంతో గుద్ధి చంపిన అమెరికన్ పోలీస్ పైన సరైన ఆధారాలు లేవంటూ అమెరికా కోర్టు విడుదల చేయడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అమెరికా ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

వెంటనే భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ వెంటనే ఈ అంశంపై స్పందించి, అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి స్వతంత్రంగా ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ చేశారు..అనేక ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లి ఈ ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరం అయితే ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరం అని కేటీఆర్ అన్నారు.

- Advertisement -

గత సంవత్సరం జనవరిలో సియాటెల్ నగరంలో కెవిన్ డేవ్ అనే పోలీసు అధికారి 115 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న తన కారు ఢీకొనడంతో జాహ్నవి మరణించింది. అయితే ఆ సంఘటన జరిగిన వెంటనే పోలీస్ అధికారి జరిగిన ప్రమాదం గురించి బాధపడకుండా, వర్ణ వివక్షతో మాట్లాడుతున్న వీడియో బయటకి వచ్చింది. దీంతో ఆ పోలీస్ అధికారి కావాలనే గుద్ధి చంపారని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement