Saturday, November 23, 2024

రెండు తెలుగు రాష్ట్రాల‌ని ఒక‌టిగా చేద్దాం..జ‌గ్గారెడ్డి..

ప్రజల ఆలోచన మేరకే తాను ముందుకెళ్తానని.. ఏ ప్రాంతానికీ తాను వ్యతిరేకం కాదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే మెరుగైన జీవితం ఉంటుందని భావించి కొట్లాడారని.. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడామని.. కానీ, ప్రజల ఆకాంక్షలు నెరవేరలేని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ సమైక్య వాదంతో ముందుకొస్తే తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలోనూ తాను సమైక్య వాదాన్నే వినిపించాననిగుర్తుచేశారు. రెండుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాల‌ని ఒక‌టి చేద్దామ‌ని తెలిపారు.

అందరూ తెలంగాణ ద్రోహి అన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచానని.. సమైక్యం తన వ్యక్తిగత అభిప్రాయమని పార్టీకి సంబంధం లేదని జగ్గారెడ్డి స్ఫ‌ష్టం చేశారు. ఆంధ్ర, తెలంగాణ నాయకులు మళ్లీ సమైక్య వాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఈ అంశంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి అభిప్రాయం వేరు, తన వ్యక్తిగత అభిప్రాయం వేరని అన్నారు. గతంలో తాను అన్నట్టుగానే ఇప్పుడు ఒక్కొక్కరు సమైక్యానికి అనుకూలంగా మాట్లాడుతున్నారని.. విభజన జరిగినా.. ఆంధ్రా ప్రజలు కోటిమందికి పైగా తెలంగాణలో ఉన్నారని చెప్పారు. ఆరోజు నన్ను తప్పుబట్టిన వారు .. ఇప్పుడు సమైక్యానికి మద్దతు పలుకుతున్నారని జగ్గారెడ్డి మండిప‌డ్డారు.

ఆంధ్రాలో పార్టీ పెట్టమని కోరుతున్నారని కేసీఆర్ అన్నారని..  పార్టీ పెట్టడం ఎందుకు రెండు రాష్ట్రాలను కలిపేద్దాం అని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రతిపాదించారని చెప్పారు.  సమైక్యం విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివ‌ని అన్నారు. కాగా ఏపీలో కూడా టీఆర్ఎస్ ను ఏర్పాటు చేయాలని..టిఆర్ ఎస్ ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ అన్న మాట‌ల‌ని గుర్తు చేశారు. దళితబంధును అమలు చేసిన తర్వాత ఈ వినతులు మరింత ఎక్కువయ్యాయని కేసీఆర్ చెప్పారు. అయితే ఇది ప్రజల డిమాండ్‌ కాదని, నాయకుల అభిప్రాయం మాత్రమేనని జగ్గారెడ్డి తెలిపారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement