యంగ్ హీరో నాగశౌర్య ఫాంహౌస్ తో పాటు విల్లాలో కూడా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని..ఈ మేరకు అందిన సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. దాంతో పేకాటరాయుళ్ళు పోలీసులకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. అంతేకాదు కోట్ల రూపాయలు దొరికాయి. మరి ఇంత జరుగుతున్నా..ఈ యువ హీరోకి తెలియదా అనే అనుమానాలు తలెత్తాయి. అసలు ఈ జూదాన్ని ఆడించే కింగ్ మేకర్ ఎవరు..ఎప్పటి నుంచి జరుగుతోంది..ఇలా పలు ప్రశ్నలు తలెత్తాయి.వాటన్నింటికి సమాధానాలు దొరికాయి పోలీసుల ఎంక్వైరీలో. మరి ఆ వివరాలు ఇలా ఉన్నాయి..గుత్తా సుమన్ కుమార్ ఈ జూదం వెనుక వున్న వ్యక్తి ఇతనేనని తేలింది. అయితే ఇతడిది మామూలు బిల్డప్ కాదండోయ్..జిగేల్ మనే లైట్స్.. అదిరిపోయే సౌండ్ సిస్టమ్.. గువ్వలు గుబేల్ మనే విధంగా ఉండే సౌండ్ బీట్స్.. ఇదంతా దర్జాగా సాగుతోన్న దందా.
అంతేనా ప్రత్యేకంగా ఒక ఇన్విటేషన్ కార్డు కూడా పెట్టి ప్రచారం చేసుకుంటున్నాడు ఈ క్యాసినో కింగ్. అందులోనూ డిసెంబర్ 31 నైట్ మాదిరిగా రేట్ కార్డును కూడా గ్రాఫిక్స్ చేయించి మరి బిజినెస్ చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని వీఐపీల నెంబర్లన్నీ సుమన్ ఫోన్ లో ఉన్నాయంటే ఆశ్చర్యపోవడం పోలీసుల వంతయింది అంటే నమ్మండి. అంతటి మాయగాడు..ఈయన చేయని దందా లేదంటే నమ్మండి. మళ్ళీ ఈయనగారికి గన్ మెన్ లు కూడా. తన మాయ మాటలతో ఎంతటి వాళ్లనైనా ఈజీగా బుట్టలో వేసుకుంటాడు గుత్తా సుమన్.
తాండూరులో 55 ఎకరాలు మోసం చేసిన బాధితుల్లో ఓ డాక్టర్, పోలీస్ అధికారి కూడా ఉన్నారు. అలాగే గుంటూరులోనూ గుత్తా సుమన్‌పై పలు కేసులు ఉన్నాయి. అమెరికాలో ఉన్న పలువురు ఎన్నారైలు కూడా సుమన్ వలలో పడ్డారు. జీఎస్కేప్, సత్యసాయి హోమ్స్ పేరిట రియల్టర్ అవతారమెత్తి మోసాలకు పాల్పడ్డాడు. కియా కార్ల డీలర్‌షిప్ పేరుతో కోట్ల రూపాయలు ముంచేశాడు. రెస్టారెంట్లలోనూ పేకాట క్లబ్స్ నడిపిన సుమన్… నిడమానూరు దగ్గర డ్రైవ్-ఇన్ రెస్టారెంట్ పేరుతో క్యాసినోలు నిర్వహించేవాడు. ఎడ్ల పందాల పేరుతోనూ గుత్తా సుమన్ దందాలు చేసేవాడు.
న్యూస్ ఛానెల్ ఓనర్ పేరుతో పలువురిని బెదిరించిన చరిత్ర కూడా ఉంది మనవాడికి. సినీ ఫైనాన్షియర్‌గానూ బిల్డప్ ఇచ్చే గుత్తా సుమన్… కొలంబోలో క్యాసినోలకు బ్రోకర్‌గా ఉన్నాడు. క్యాసినోల కోసం పలువురిని కొలంబో కూడా తీసుకెళ్లాడు. ఓ భూకబ్జా కేసులో ఇటీవలే విజయవాడ నుంచి పరారైన గుత్తా సుమన్.. హైదరాబాద్‌లో తేలాడు. ఇక్కడికొచ్చాక ఊరికే ఏం లేడు. నగర శివార్లను తన అడ్డాలుగా మార్చుకుని క్యాసినో నిర్వహిస్తున్నాడు. ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. చేసిన పాపాలు ఊరికే పోతాయా..సుమన్ పాపం ఇన్నాళ్లకి పండింది. అయితే ఈ వివాదంలో నాగశౌర్య పేరు మారు మ్రోగింది. మరి ఆఖరికి ఏం తేలుతుందో చూడాలి.