ప్రభన్యూస్ : ప్రపంచ ఛాంపియన్షిప్ ట్రిపుల్ రజత పతక విజేత, తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో పసిడి పతకంతో మెరిసింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో సెప్టెంబర్ లో జరిగిన యాంక్టన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మూడు రజత పతకాలను గెలుచుకున్న సురేఖ తాజాగా బంగ్లాదేశ్లో జరిగిన ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది.
తొలుత జ్యోతి 2015 ప్రపంచ ఛాంపియన్ కిమ్ యున్హీని 148-143తేడాతో సెమీస్లో విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ఫైనల్లో ఓహ్ యాెెహ్యూన్పై ఒక్క పాయింటు తేడాతో (146-145) విజయం సాధించిన సురేఖ దేశానికి బంగారు పతకాన్ని అందించింది. 25ఏళ్ల జ్యోతి సురేఖకు ఆసియా ఛాంపియన్షిప్లో ఇది రెండో స్వర్ణంకాగా ఈ సీజన్లో ఇది భారత్కు ఇదే తొలి పసిడి పతకం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital