Tuesday, January 7, 2025

TG | అత్యధికంగా మాట్లాడే భాషలలో తెలుగు రెండవది : సీఎం రేవంత్ రెడ్డి

  • ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం
  • తెలంగాణ-ఏపీ కలిసి ప్రపంచంతో పోటీ పడాలి
  • ప్రపంచ తెలుగు సమాఖ్య సదస్సు ముగింపు వేడుక‌

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రపంచ తెలుగు సమాఖ్య సదస్సు ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మొద‌టి ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహిస్తే… 12వ మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.

నందమూరి తారకరావు గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సంస్థ చాలా గొప్పదన్నారు. విదేశాలకు వెళ్లిన వారంతా ఒకే వేదికపైకి రావడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు రెండో స్థానంలో ఉందని సీఎం రేవంత్ అన్నారు. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో 18 కోట్ల మంది తెలుగు వారున్నారు అని అన్నారు.

ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోవిడ్ సమయంలో తెలుగు వారి స‌త్తా ఏంటో ప్రపంచానికి తెలిసిపోయిందని వివరించారు. నేడు జాతీయ రాజకీయాల్లోనూ తెలుగువారి పాత్ర ఎంతో కీలకమైందన్నారు. రాజీవ్ గాంధీ తన ప్రధానిగా ఉన్న సమయంలో భారతదేశానికి కంప్యూటర్‌ను పరిచయం చేశారు. చంద్రబాబు ఐటీని మన తెలుగువారికి తీసుకొచ్చి అభివృద్ధికి తోడ్పడ్డారు అని పేర్కొన్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందన్నారు. ఏపీ, తెలంగాణ‌ రెండు రాష్ట్రాలు పరస్పరం పోటీ పడటం కాద‌ని.. రెండు రాష్ట్రాలు కలిసి ప్రపంచంతో పోటీ పడాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తెలుగు రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుందాం. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను కూడా చర్చించి పరిష్కరించుకంటాం.. అలాంటిది రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారించుకోలేమా అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement