సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల చంద్రబాబు సంతాపం తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్‌గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ‘‘నటుడిగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారు. టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా, విలక్షణ నటునిగా పేరున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటు. కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయింది.
కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాః నారా లోకేశ్
సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న పాత్రలతో ఆయన చేసిన ప్రయోగాలు, వేగంగా సినిమాలు పూర్తి సృష్టించిన రికార్డులు నేటి సినీ రంగం ఎదుర్కుంటున్న ఒడిదుడుకుల నుంచి బయటపడేందుకు ఒక మార్గమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నానన్నారు.