Monday, November 25, 2024

Harish Rao | ఈ 100 కోట్లు స‌రే.. ఆ 12,400 కోట్ల ఒప్పందాల మాటేమిటో చెప్పండి

తెలంగాణలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని వాపస్ చేస్తూ సీఎం రేవంత్ నిర్ణయంపై హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రూ.100 కోట్లు స‌రే.. దావోస్‌లో అదానీతో రూ.12,400 కోట్ల ఒప్పందాల మాటేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటని ప్ర‌శ్నించారు.

కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తోందని హ‌రీశ్ రావ్ అన్నారు. రాహుల్ గాంధీ అవినీతిపరుడని అంటున్న అదానికే.. గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ ప‌రుస్తొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు రాహుల్ ఢిల్లీలో అదానీపై పోరాటం చేస్తుంటే… ఇక్కడ రేవంత్ రెడ్డి దోస్తీ చేసి డీల్ కుదుర్చుకున్నారని అన్నారు. ఇప్పుడు అదానీ అవినీతి బయటకు రాగానే రేవంత్ మాట మారుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement