Saturday, November 23, 2024

మత్స్యకారుడి పంటపండింది: ఆ చేప ధర 5.80 లక్షలు..

ఒడిశాకు చెందిన కొంతమంది మత్స్యకారులకు లక్షలు విలువ చేసే ఓ అరుదైన చేప చిక్కింది. ఘోల్ చేపలు గేలానికి చిక్కాయి. మొత్తం 11 ఘోల్ చేపలు చిక్కగా.. వీటిని టేలియా చేపలని కూడా పిలుస్తారట. ఈ టేలియా చేపలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని, ఆయుర్వేద మెడిసిన్లలో ఈ చేపను ఎక్కువ ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఆ జాలర్లు వేలం వేయగా.. ఈ చేప సుమారు రూ. 5.80 లక్షలు పలికింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కనిపించే ఈ ఘోల్ చేపలు ఇనుము, అయోడిన్, మెగ్నీషియం, ఫ్లోరైడ్, సెలీనియం, టౌరిన్ లక్షణాలు కలిగి ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement