Thursday, December 5, 2024

Shobitha Shivanna | బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య..

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ టీవీ సీరియల్ బ్రహ్మగంతు ఫేమ్ శోభిత శివన్న కన్నుమూశారు. కన్నడతో పాటు తెలుగులోనూ పలు సీరియల్స్‌లో నటించిన శోభిత‌ ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి శ్రీరామ్‌నగర్‌లోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

శోభిత ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలరించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

కాగా, సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభిత… ప్రస్తుతం త‌న‌ భర్త సుధీర్‌తో కలిసి శ్రీరామనగర్ కాలనీలో నివసిస్తోంది. అయితే, పెళ్లి తర్వాత శోభిత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. సీరియల్స్ మాత్ర‌మే కాకుండా తెలుగులో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాలోనూ నటించింది. శోభిత ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని బెంగళూరుకు తరలించనున్నారు. ఆమె మృతి పట్ల సినీ, సీరియల్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement