నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ డ్రగ్ ఓవర్ డోస్‌తో ఇవ్వాల (సోమవారం) చనిపోయాడు. ముంబైలోని అంధేరిలో తన స్నేహితుడి బాత్రూమ్లో శవమై కనిపించినట్టు తెలుస్తోంది. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. తన రూమ్మేట్ ఉదయం ఇంటికి చేరుకున్నప్పుడు రాజ్‌పుత్ బాత్రూంలో నేలపై పడి ఉన్నట్టు తెలుస్తోంది.
ఆ తర్వాత వాచ్మెన్ సహాయంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా, రాజ్‌పుత్ కుటుంబం ఢిల్లీలో నివసిస్తోంది. ఆదిత్యసింగ్ రాజ్‌పుత్ అంధేరీ లోఖండ్‌వాలాలోని లష్కరియా హైట్స్ అనే భవనంలో రూమ్మేట్తో కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది.