Friday, November 22, 2024

కొత్త సంవత్సరంలో విస్తరణే టెలికం కంపెనీల లక్ష్యం

కొత్త సంవత్సరంలో టెలికం రంగం 5జీ నెట్‌వర్‌ ్క విస్తరణపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనుంది. సాధ్యమైనన్ని నగరాలకు ఈ సేవలను విస్తరించాలని అన్ని కంపెనీలు భారీగా పెట్టుబడులు సమీకరిస్తున్నాయి. గతంలో మన దేశ ఆర్ధకాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన భారత టెలికం రంగం తరువాత కాలంలో రుణా ఊబిలో కూరుకుపోయింది. దీని వల్ల చాలా కంపెనీలు మార్కెట్‌లో లేకుండా పోయాయి. ఇప్పుడు మళ్లిd 5జీతో పూర్వ వైభవం దిశగా టెలికం రంగం అడుగులు వేస్తోంది. 5జీ నెట్‌వర్క్‌ విస్తరణకు 1.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని సంస్థలు లక్ష్యంగా పెట్టకున్నాయి. పెట్టుబడులు పెరుగుతుండటంతో టారీఫ్‌ ఛార్జీలు కూడా పెంచే అవకాశం ఉందని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఏ టెలికం సంస్థ కూడా తాము 5జీకి అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించలేదు. పెట్టుబడులు సమీకరణ చేయాల్సి ఉన్నందున నష్టాలు రాకుండా ఉండేందుకు తప్పనిసరిగా కంపెనీలు నెమ్మదిగా రేట్లు పెంచడం, ప్లాన్లను అప్‌డేట్‌ చేయడం వంటి చర్యల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు గట్టిగానే ప్రయత్నించే అవకాశం ఉంది.

రిలయన్స్‌ తన టెలికం వ్యాపారం జియో ద్వారా 5జీ నెట్‌వర్‌ ్క విస్తరణ కోసం 2023 చివరి నాటికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో 87,943 కోట్లను స్పెక్ట్రమ్‌ కేటాయింపుల కోసం చెల్లించాల్సి ఉంది. మిగిలిన 1.12 లక్షల కోట్లను పూర్తిగా 5జీ నెట్‌వర్క్‌ విస్తరణ, అనుసంధానం కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. భారతీ ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌ కోసం 27-28 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ 16 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దేశీయంగానే అభివృద్ధి చేసిన 4జీ నెట్‌వర్క్‌ను టీసీఎస్‌, సీ-డాట్‌ సంయుక్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌కు అందించనున్నాయి. తరువాత కాలంలో దీన్ని 5జీకి అప్‌డేట్‌ చేయనుంది. అదానీ గ్రూప్‌ తన టెలికం బిజినెస్‌ విస్తరణ గురించి ఇంకా అధికారింగా ప్రకటించలేదు. మొత్తంగా టెలికం రంగం 2023లో 1.5 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నాయి.
పలు సంస్కరణలు

2022లె టెలికం రంగంలో అనేక నిర్మాణాత్మక సంస్కరణలు చూశామని టీెలికం ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సిఓఏఐ) డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీ కొచ్చర్‌ చెప్పారు. ఇ-కెవైసీ, స్పెక్ట్రమ్‌ వినియోగ రుసుముల తొలగింపు, ప్రత్యక్ష మార్గంలో వంద శాతం ఎఫ్‌డీఐ అనుమతి, బ్యాంక్‌ గ్యారంటలు, సర్ధుబాటు చేసిన స్థూల ఆదాయాలు, వడ్డీరేట్లు, జరిమానాలు, రైట్‌ ఆఫ్‌ వే లాంటి అంశ:ఆల హెతుబద్దీకరణ వంటి అనేక సంస్కరణలు 2022లో టెలికం రంగంలో గుణాత్మక మార్పు తీసుకొచ్చాయని ఆయన తెలిపారు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా టెలికం రంగంలో మౌలికవసతుల కల్పనకు అనువైన విధానాలను తీసుకు వచ్చాయని డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రొవైడర్స్‌ అసోసియేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ టీఆర్‌ దువా తెలిపారు.

- Advertisement -

భారీగా 5జీ బేస్‌ స్టేషన్లు

దేశంలో వారానికి 2,500 కొత్త 5జీ బేస్‌ స్టేషన్లను ఏర్పాటవుతున్నాయని ఇటీవల పార్లమెంట్‌లో టెలికం శాఖ సహాయ మంత్రి దేవూసిన్హ చౌహాన్‌ తెలిపారు. నవంబర్‌ 26 నాటికి దేశవ్యాప్తంగా 20,980 మొబైల్‌ బేస్‌ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. టెలికం గేర్‌ తయారీ సంస్థలు నోకియా, ఎరిక్సన్‌ భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద 42 టెలికం గేర్‌ తయారీ సంస్థలు 4,115 కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement