Friday, November 22, 2024

టీబీ రహిత రాష్ట్రం వైపు తెలంగాణ అడుగులు.. రాష్ట్రానికి 4 జాతీయ అవార్డులు ప్రకటించిన కేంద్రం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీబీ రహిత రాష్ట్రం వైపు తెలంగాణ అడుగులు వేస్తున్నది. టీబీ నియంత్రణలో ప్రతిభ కనబరచిన 4 జిల్లాలకు కేంద్రం జాతీయ అవార్డులు ప్రకటించింది. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర టీబీ విభాగం అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు. టీబీ నిర్మూలన కార్యక్రమాల సూచికల ఆధారంగా తెలంగాణ ప్రస్తుతం దేశంలోనే మూడవ ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రంగా నిలచింది. 2015 కేసులతో పోల్చితే తెలగాణలో టీబీ కేసుల తగ్గింపు ప్రతీ లక్ష జనాభాకు గణనీయంగా తగ్గింది. ఇందులో భాగంగా 60 శాతం కేసులు తగ్గించిన నిజామాబాద్‌కు బంగారు పతకం, 40 శాతం తగ్గించిన భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ జిల్లాలకు వెండి, 20 శాతం తగ్గించిన ఖమ్మంకు కాంస్య పతకాలు లభించాయి.

కార్యక్రమంలో రాష్ట్ర్ర టీబీ విభాగం జెడి డా.రాజేశం, నిజామాబాద్‌ డీఎంహెచ్‌వో సుదర్శనం, ప్రపంచ ఆరోగ్య సంస్థ కన్సల్టెంట్‌ శ్రీగణ, ప్లానింగ్‌ ఆఫీసర్‌ వాసు ప్రసాద్‌లు తెలంగాణ ప్రభుత్వం తరఫున అందుకున్నారు. కాగా, టీబీ తీవ్రత ఎక్కువగా ఉండి మల్టిd డ్రగ్‌ థెరపీ తీసుకునే వారికి రూ.1200 రవాణా చార్జీలు, గిరిజన ప్రాంతాలతో వీటికి అదనంగా మరో రూ.750ని ప్రభుత్వం అందిస్తున్నది. అలాగే, బాధితులకు పోషకాహార కిట్స్‌ అందించడం వంటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా టీబీ నియంత్రణలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.

- Advertisement -

2025 నాటికి పూర్తి స్థాయి నిర్మూలన లక్ష్ల్యం..

టీబీ నియంత్రణలో సత్తా చాటి అవార్డులు పొందిన జిల్లాలకు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు కృషి చేసిన వైద్యాధికారులను అభినందించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్రంలో 2025 నాటికి పూర్తి స్థాయిలో టీబీ పరీక్షలు, వైద్యం వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement