Thursday, January 16, 2025

Delhi | ఎన్నిక‌ల్లో తెలంగాణ హామీలు.. హ‌స్తిన వాసుల‌కు రేవంత్ రెడ్డి వ‌రాలు

  • కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే 300యూనిట్లు విద్యుత్ ఫ్రీ
  • అయిదు వంద‌ల‌కే గ్యాస్ సిలిండ‌ర్లు
  • ఈ ప‌థ‌కాలు తెలంగాణ‌లో అమ‌లు చేస్తున్నామంటూ వెల్ల‌డి


న్యూఢిల్లీ – ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఉచిత ప‌థ‌కాల‌నే ప్ర‌చార అస్త్రాలుగా సంధించింది.. తెలంగాణ‌లో రేవంత్ స‌ర్కార్ అమ‌లు చేస్తున్న ఉచిత ప‌థ‌కాల‌ను ఇక్క‌డా అమ‌లు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ నేతలు ఎన్నిక‌ల హామీల పోస్ట‌ర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 300యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను చూసి, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓట‌ర్ల‌ను కోరారు. తెలంగాణలో ఒకేసారి రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామ‌ని తెలిపారు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్పారు. దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారింద‌ని అంటూ ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ అన్నారు..

11 ఏళ్లలో 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల‌ని, .. కానీ ఇచ్చింది మాత్రం కేవలం 7 లక్షల ఉద్యోగాలు మాత్రమేనని ఆరోపించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వ‌చ్చి ఏడాది కాక‌ముందే 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు, రూ.500 కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తెలంగాణాలో అందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వాటిలోని రెండు ప‌థ‌కాల‌ను ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు అందిస్తామ‌ని చెప్పారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement