Thursday, November 21, 2024

Delhi | తెలంగాణ అప్పులు స్వల్పం, అభివృద్ధి అద్భుతం.. ఎంపీ ప్రశ్నలకు కేంద్రం బదులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీజేపీ పాలిత, ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ అప్పులు అతి తక్కువని, ఆ సొమ్మును కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథకాలకే ఖర్చు చేసిందని ఖమ్మం ఎంపీ, బీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పులతో పాటు నాబార్డ్, వివిధ బ్యాంకుల ద్వారా వివిధ కార్పొరేషన్లు, సంస్థలు పొందిన రుణాల వివరాలను వెల్లడించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్నిప్రశ్నించారు. వివిధ రాష్ట్రాలకు స్కీముల ద్వారా అందించిన నిధుల వివరాలనూ వెల్లడించాలని కోరారు. నామ ప్రశ్నలకు మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బదులిచ్చారు.

- Advertisement -

తెలంగాణాకు 2019 మార్చి నాటికి రూ,1,90, 203 కోట్ల అప్పులు ఉండగా , అవి 2023 మార్చి నాటికి రూ.3,66,306 కోట్లకు చేరాయన్నారు. తమిళనాడుకు 2023 మార్చి నాటికి రూ.7, 53,860 కోట్ల అప్పులున్నాయని కేంద్రమంత్రి వెల్లడించారు. అలాగే మహారాష్ట్రకు రూ. రూ. 6, 80,357 కోట్లు, గుజరాత్‌కు రూ.4, 23, 711 కోట్లు, కర్ణాటకకు రూ. 5, 35, 157 కోట్లు, మధ్యప్రదేశ్‌తు రూ.3, 78, 617 కోట్లు, రాజస్థాన్‌కు రూ.5, 37, 013 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు రూ.7,10,210 కోట్లు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రూ. 6, 08, 313 కోట్ల అప్పులున్నాయని ఆమె వివరించారు. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అప్పులే తక్కువని రిజర్వ్ బ్యాంక్ నివేదిక స్పష్టం చేసిందని నామ చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement