సుహుల్: జర్మనీలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్ జూనియర్ షూటింగ్ పోటీల్లో తెలంగాణకు చెందిన ధనుష్ శ్రీకాంత్ పసిడి పతకం గెలుచుకున్నాడు. పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ రేసులో 24 షాట్ల ఫైనల్‌లో మనోడి గురి అదిరింది. మొత్తంగా 250.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సాధించాడు. 249.4 పాయింట్లు స్కోర్ చేసిన స్వీడన్ షూటర్ పొంటస్ కల్లిన్ రజతం చేజిక్కించుకోగా, మూడవ స్థానంలో నిలిచిన ఫ్రెంచ్ ఆటగాడు రొమైన్ అఫ్రెరే కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. అదేవిధంగా స్కీట్ మిక్స్‌డ్ టీమ్ పోటీలోనూ భారత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. స్వీడిష్ ప్రత్యర్థులు డేవిడ్ జాన్సన్, ఫెలిసియా రోస్‌లను భారత జోడీ హర్మెహర్ లాలీ, సంజన్ సూద్ ఓడించారు. ఇప్పటి వరకు మూడు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యంతో భారత్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించిన అమెరికా రెండవ స్థానంలో కొనసాగుతోంది.
Golden Gun – ప్రపంచ షూటింగ్ పోటీలలో తెలంగాణ తేజం ధనుష్ శ్రీకాంత్ కు స్వర్ణం….
Advertisement
తాజా వార్తలు
Advertisement