Wednesday, November 20, 2024

వరల్డ్​ బాక్సింగ్​ చాంపియన్​గా తెలంగాణ యువకుడు.. హుస్సాముద్దీన్​కు ఘన సత్కారం

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ క్రీడల్లో 57 KG విభాగంలో కాంస్యపతకం సాధించిన తెలంగాణ యువ స్టార్ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్ సోమవారం క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను డా॥ బిఆర్ అంబేద్కర్
తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు . కామన్​వెల్త్​ క్రీడల్లో రెండు పతకాలు చేజిక్కించుకున్న నిజామాబాద్
జిల్లా బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్ ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో తొలి పతకం సాధించడం విశేషం.

- Advertisement -

హుస్సాముద్దీన్ 2018, 2022లో జరిగిన కామన్ వెల్తు గేమ్సులో కాంస్య పతకాలు సాధించారు. 2023 లో ప్రపంచ
బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలో కాంస్య పతకం సాధించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా పటంలో నిలిపారు. ఈ సందర్భంగా మస్సాముద్దీన్ ను క్రీడాశాఖ కార్యదర్శి శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నూతన క్రీడా పాలసీతో పాటు ప్రభుత్వ పరంగా క్రీడలను ప్రోత్సహించడానికి క్రీడాకారులకు అందజేస్తున్న సహాయ సహకారాలను వివరించారు. వచ్చే బాక్సింగ్ క్రీడలలో తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలపాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement