Monday, November 18, 2024

కేంద్ర హోంశాఖ స్పెషల్ ఆపరేషన్ మెడల్స్.. టాప్‌లో తెలంగాణ, అదనపు డీజీ సహా 13 మందికి పతకాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ ప్రకటించింది. 2022వ సంవత్సరానికిగానూ కేంద్ర హోంశాఖ 4 స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ ప్రకటించింది. దేశం, రాష్టం, కేంద్రపాలిత ప్రాంతాల భద్రత, సమాజ భద్రతపై ప్రభావం చూపే కార్యకలాపాలను గుర్తించే లక్ష్యంతో 2018లో ఈ పతకం ఏర్పాటైంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, సరిహద్దు చర్యలు, ఆయుధాల నియంత్రణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధ చర్యలు, రెస్క్యూ కార్యకలాపాలు వంటి విభాగాల్లో ప్రత్యేక ఆపరేషన్ కోసం ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన ఈ పతకాలను ప్రకటిస్తారు. రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల్లో సేవలందిస్తున్న పోలీసులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ మెడల్స్ అందజేస్తుంది. ఎడారి ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం 13 స్పెషల్ ఆపరేషన్ మెడల్స్ ను సొంతం చేసుకుంది. ఈ పథకాలకు ఎంపికైన వారిలో అదనపు డీజీ అనిల్ కుమార్, డి.ఎస్.పి కె రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ మొగుళ్ల వెంకటేశ్వర్ గౌడ్, మరో నలుగురు ఎస్సైలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement