Wednesday, November 20, 2024

ఈ-సేవల్లో తెలంగాణ టాప్‌..

ఎలక్ట్రానిక్స్‌ సర్వీసుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ-పాలనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో కేటీఆర్‌ అధ్యక్షతన ”ఈ-గవర్నెన్స్‌ -2022” జాతీయ సదస్సు ఇండియాస్‌ టెకేడ్‌ డిజిటల్‌ గవర్నెన్స్‌ నిర్వహించారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేందర్‌ సింగ్‌ ఈ సెమినార్‌ను ప్రారంభించారు. మంత్రి కేటీఆర్‌ అధ్యక్షోపన్యాం చేస్తూ… తెలంగాణలో ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తున్నామని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో శరవేగంగా ఐటీ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఎగుమతుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ ప్రాజెక్టు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పలు రాష్ట్రాలతో కలిసి తమ పరిశోధనల ఫలాలను పంచుకునేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు.

ఎం-గవర్నెన్స్‌కు ప్రాముఖ్యత..
సామాజిక స్పృహలేని సాంకేతికత వ్యర్థం. డిజిటల్‌ లావాదేవీల కోసం తెలంగాణ టీ-వ్యాలెట్‌ తీసుకొచ్చింది. టీ యాప్‌ ఫోలియో ద్వారా రోజుకు 270 సేవలందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ వివరించారు. ఈ-గవర్నెన్స్‌తో పాటు ఎం- గవర్నెన్స్‌ (మొబైల్ గవర్నెన్స్‌)కు రాష్ట్ర ప్రభుత్వంఅధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎమర్జింగ్‌ టెక్నాలజీలను పలు ప్రభుత్వ శాఖల పనితీరులో భాగం చేసి సమస్యలు, సవాళ్లకు చెక్‌ పెట్టామన్నారు. స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా సిటిజెన్‌ సర్వీసులను అందజేస్తున్నామని వివరించారు. ఫెస్ట్‌ యాప్‌ ద్వారా 17 సేవలను రవాణాశాఖ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. రియ ల్‌టైమ్‌ డిజిటల్‌ అథెంటికేషన్‌ ఆఫ్‌ ఐడెం టిటీ (ఆర్‌టీడీఏఐ) ద్వారా ఎమ్‌ గవర్నెన్స్‌ సులువుగా మారిందన్నారు.

మీ-సేవ 2.0 ద్వారా రోజుకు లక్ష మందికి సేవలు..
”తెలంగాణ ఏర్పడిన తర్వాత ”మీ-సేవ”ను రీ ఇంజ నీరింగ్‌ చేశాం. ”మీ-సేవ 2.0” ప్రవేశ పెట్టాం. ”మీ-సేవ” ద్వారా రోజుకు ఒక లక్ష మందికి ఆన్‌లైన్‌ సేవలందిస్తున్నాం. 4500 కేంద్రాలు పని చేస్తున్నాయి. ఈ ఏడేళ్లలో ”మీ-సేవ” ద్వారా 4 బిలియన్‌ డాలర్ల లావాదేవీలు జరిగాయంటే సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు” అని కేటీఆర్‌ పేర్కొన్నారు.. నాస్కామ్‌ సౌజన్యంతో టీ ఎయిమ్‌… ”నాస్కామ్‌ సౌజన్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యే కంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాజెక్టుల కోసం టీ ఎయి మ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా వ్యవసాయంలో ఏఐ ఆధారిత పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌, నేషనల్‌ ఈ-గవర్నెన్స్‌ ప్లాన్‌ ఫర్‌ అగ్రికల్చర్‌లను చేపట్టాం. డ్రోన్‌ సాంకేతికతో మెడిసిన్‌ ఫ్ర మ్‌ ది స్కై ప్రాజెక్టును చేపట్టామని” మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

మరో రెండు ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లు ఇవ్వండి..
డిజిటల్‌ అక్షరాస్యత కోసం కావాల్సిన సదుపాయాలను కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దీనికోసం టి- ఫైబర్‌ ద్వారా 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు, 80 లక్షల గృహాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ కల్పించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఎలక్ట్రానిక్‌ తయారీ క్లస్టర్లకు అదనంగా మరో రెండు మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లు తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. స్పేస్‌ రీసెర్చ్‌ రంగంలో హైదరాబాద్‌ శరవేగంగా అభివృద్ధి చెందు తోందని కేసీఆర్‌ అన్నారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ స్పేస్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement