Wednesday, November 20, 2024

తెలంగాణ‌లో భారీగా ప‌డిపోతున్న ఉష్ణోగ్ర‌త‌లు .. వ‌ర్షాలు కురిసే ఛాన్స్ ..

చలికాలంలో సాధార‌ణంగా ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గుతుంటాయి. కాగా తెలంగాణ‌లో రాత్రిపూట ఉష్ణోగ్ర‌త‌లు మ‌రింత భారీగా ప‌డిపోతున్నాయి. దీని ప్ర‌భావంతో రాష్ట్రంలో అక్క‌డ‌క్క‌డ తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ అధికారులు వెల్ల‌డించారు. రానున్న ఐదు వారాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని వారు వెల్లడించారు. ఈశాన్య దిశ నుంచి రాష్ట్రంలోకి శీతల గాలులు వీస్తున్న నేపథ్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెదక్ లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ లో 14.8 డిగ్రీలు, నిజామాబాద్ లో 17.8, ఖమ్మంలో 19, నల్గొండలో 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా… హైదరాబాద్ లో 17 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31 నుంచి 33 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement