ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. తెలంగాణ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తుండగా, ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని తెలంగాణ అంటోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే నాగార్జునసాగర్ వద్ద జల విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం నిలిపేసింది. నీటి ప్రవాహం తగ్గిపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు వద్ద తెలంగాణ జెన్‌కో జల విద్యుదుత్పత్తిని నిలిపేయడం గమనార్హం. గత అర్ధరాత్రి నుంచి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కావట్లేదు. ప్రస్తుతం పులిచింతల జలాశయం నీటి నిల్వ 39.64 టీఎంసీలుగా ఉంది. దీని నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. కృష్ణా బేసిన్‌లోని సాగర్, పులిచింతల వద్ద తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై ఇటీవల ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఈ వార్త కూడా చదవండి: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం