Monday, November 18, 2024

అటవీ రోడ్లపై వాహనాల అతివేగానికి కళ్లెం.. స్పీడో లేజర్‌ గన్‌లతో నిఘా..

అటవీ ప్రాంతాల్లోని రోడ్ల పై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ వన్య ప్రాణుల ప్రాణాలకు హాని కలిగిస్తున్న వాహనాలకు కళ్ళెం వేసే చర్యలను తెలంగాణ‌ రాష్ట్ర అటవీశాఖ చేపట్టింది. నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు పరిధిలో శ్రీశైలం రహదారిపై రద్దీగా ఉండే మన్న నూరు – దోమలపెంట మార్గంలో వాహనాల అతి వేగాన్ని తగ్గించేందుకు స్పీడో లేజర్‌ గన్‌లను ప్రయో గాత్మకంగా వాడుతున్నారు. వన్య ప్రాణుల ప్రాణా లకు ముప్పు కలగకుండా మన్ననూరు నుంచి దోమలపెంట రోడ్‌లో హాహనాల వేగాన్ని 30 కిలో మీటర్లకు కుదిస్తూ గతంలో అటవీశాఖ సూచిక బోర్డులను ఏర్పాటు చేసింది. అలాగే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలు తిరగ డాన్ని నిషేదించారు.

ప్రతి నెల సగటున 30 వరకు అటవీ జీవులు ప్రమా దాల భారీన పడు తున్నట్లు అటవీ అధికారుల దృష్టికి వచ్చింది. మూడు రోజుల క్రితం వటచర్లపల్లి సమీపంలో ఓ కారు ఢీ కొట్టడంతో మచ్చల జింక చనిపోయింది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు నిఘా పెంచారు. స్పీడో లేజర్‌ గన్‌లను ఉపయోగిస్తూ స్పీడ్‌ నిబంధనలు ఉల్లంఘిచిన వాహనాల ఫోటోలను తీస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement