Tuesday, November 19, 2024

విద్యార్థులారా సిద్ధంగా ఉండండి.. నేడే పదో తరగతి ఫలితాలు

తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల ప్రకటనకు విద్యాశాఖ అధికారులు ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది వార్షిక పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఫార్మేటివ్ అసెస్‌ మెంట్ (ఎఫ్ఏ-1) ఆధారంగా విద్యార్థులకు విద్యాశాఖ మార్కులు కేటాయించి గ్రేడ్లను ఖరారు చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,398 మంది విద్యార్థులను ఉత్తీర్ణులుగా పరిగణించి గ్రేడ్లు కేటాయించింది. వీరిలో దాదాపు సగం మందికిపైగా ఈ సారి 10 జీపీఏ దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే విద్యాశాఖ మార్కుల అప్‌లోడింగ్‌ ప్రక్రియను పూర్తి చేసింది.

కాగా, కరోనా ఉధృతి కారణంగా వరుసగా రెండో ఏడాది పదో తరగతి పరీక్షలు రద్దు చేసింది ప్రభుత్వం. గత ఏడాది నాలుగు ఎఫ్ఏ పరీక్షల ఆధారంగా టెన్త్ ఫలితాలు ప్రకటించారు. కానీ ఈసారి ఒక్క ఎఫ్ఏ ఆధారంగానే వార్షిక పరీక్షల మార్కులు కేటాయించారు. మార్కుల మెమోలో హాల్‌టికెట్‌ నంబర్‌ ను కూడా నమోదు చేస్తారు. ఫలితాలు వెలువడిన తర్వాత నెలాఖరులోగా మెమోలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement