హైదరాబాద్, ఆంధ్రప్రభ : అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే ఉద్దేశంతో తెలంగాణ స్పేస్ టెక్ ఫ్రేమ్ వర్క్ ను ఈ నెల 18న ప్రభుత్వం ఆవిష్కరించనుంది. దేశంలోనే తొలిసారిగా అధునాతన వర్చువల్ సాంకేతికత మెటావర్స్ పద్ధతిలో దీనిని ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ తెలిపింది. మెటావర్స్ సాంకేతికతతో సృష్టించిన వర్చువల్ అంతరిక్ష వాతావరణంలో మంత్రి కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పలువురు ప్రముఖ వాణిజ్యవేత్తలు ఈ ఫ్రేమ్ వర్క్ ను లాంచ్ చేయనున్నారు. ఈ మెటావర్స్ స్పేస్ వాతావారణాన్ని హైదరాబాద్‌కు చెందిన గామిట్రానిక్స్, పార్టీనైట్ మెటా అనే కంపెనీలు రూపొందించాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..