తెలంగాణ ప్రభుత్వానికి హై కోర్టు షాక్ ఇచ్చింది. దళితబంధు అమలు చేయాలని దాఖలైన పిటిషన్లని కొట్టివేసింది. పిటిషనర్ల వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం టిఆర్ ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఈ పథకంతో దళితుల ఓట్లని కొల్లగొట్టవ్చని తెలంగాణ సర్కార్ పన్నాగం పన్నింది.
ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే.. దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుపడతానని, నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని ప్రకటించారు. దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణమని..ఇప్పటికైనా దళితుల పట్ల అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలని పిలుపునిచ్చారు. అయితే ఈ పథకాన్ని ఈసీ నిలిపివేసింది. దాంతో దళితబంథుని అమలు చేయాలని కోర్టుకెళ్లిన వారికి షాక్ తగిలింది.