Friday, November 22, 2024

Delhi | బీసీ సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రోల్‌మోడల్..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వెనుకబడిన వర్గాలకు అందజేస్తున్న సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోని మిగతా రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా నిలిచిందని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. గురువారం ఢిల్లీలో జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం ఆహిర్‌ను కలిసిన ఆయన అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులాలవారిగా జనభా లెక్కల సేకరణపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని అన్నారు.

- Advertisement -

బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో దేశవ్యాప్తంగా ఇబ్బందులున్నాయని తెలిపారు. కేంద్రంలో బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ విధానం మాదిరిగా ఓబీసీ బ్యాక్‌లాగ్ విధానాన్ని అమలు చేయాలని, బ్యాక్‌లాగ్ పోస్టులకు ఆ మేరకు భర్తీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఓబీసీ క్రీమీలేయర్ అంశంపై కూడా చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశాలపై జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌తో చర్చించామని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement