తెలంగాణలో మద్యం కిక్కు అసలు తగ్గడం లేదు. ప్రతీ ఏడాది కిక్కు మరింతగా పెరుగుతూనే ఉంది. నానాటికి మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రతీ ఏడాదిలాగే గత ఏడాది కూడా లిక్కర్ కిక్కు ఏ మాత్రం తగ్గలేదు. దీంతో ప్రభుత్వ ఖజానాకు ప్రతి ఏడాది ఆదాయం పెరుగుతూనే ఉంది.
2023 మెుదటి త్రైమాసికంలో రంగారెడ్డి జిల్లా రూ.8,436.14 కోట్లతో దేశంలోనే మెుదటి స్థానంలో ఉంది. హైదరాబాద్ రూ.3752.96 కోట్లు, మేడ్చల్- మల్కాజిగిరి రూ.1329.78 కోట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయాని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. అయితే… తెలంగాణ ఈ అమ్మకాల్లోనే దూసుకెళ్తుందంటూ ప్రతిపక్షాలు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కేసీఆర్ సాధించిన ప్రగతి ఇదేనంటూ నేతలు ఆరోపిస్తున్నారు.