తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త అందింది. పంచాయతీరాజ్ శాఖ పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటాలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 172 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు 2021 సెప్టెంబర్ 18న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకునేందుకు 2021 అక్టోబర్ 10 చివరి తేదీ. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు కాబట్టి విద్యార్హతలతో పాటు పలు క్రీడల్లో రాణించి ఉండాలి. అర్హతలు: డిగ్రీ పాస్, స్పోర్ట్స్ కోటా గైడ్‌లైన్స్ పూర్తి చేయాలి. వయసు: 18 నుంచి 44 ఏళ్లు. 100 మార్కులకు ఒకటి చొప్పున 2 పేపర్లు ఉంటాయి. ఒక్కో దాంట్లో 35 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు.
జిల్లాల వారీగా ఖాళీలు: ఆదిలాబాద్-6, భద్రాద్రి కొత్తగూడెం-7, జగిత్యాల-5, జనగామ 4, జయశంకర్ భూపాలపల్లి 6, గద్వాల 3, కామారెడ్డి 8, కరీంనగర్ 4, ఖమ్మం 9, ఆసిఫాబాద్ 4, మహబూబాబాద్ 7, మహబూబ్ నగర్, నారాయణపేట 10, మంచిర్యాల 4, మెదక్ 6, నాగర్‌కర్నూలు 6, నల్గొండ 13, నిర్మల్ 6, నిజామాబాద్ 8, పెద్దపల్లి 3, సిరిసిల్ల 3, రంగారెడ్డి 7, సంగారెడ్డి 8, సిద్దిపేట 6, సూర్యాపేట 6, వికారాబాద్ 8, వనపర్తి 3, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 1, యాదాద్రి భువనగిరి 6. కాగా హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్‌లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.