Thursday, September 12, 2024

Paris | ఒలింపిక్స్ కు తెలంగాణ అధికార బృందం..

ప్యారిస్ లో జరుగుతున్న ఒలంపిక్స్ ను సందర్శించేందుకు తెలంగాణ అధికార బృందం ఈరోజు బయలుదేరింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి నేతృత్వమ్ లో ప్రభుత్వ సలహాదారులు (క్రీడలు) జితేందర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, వి సి &ఎండీ శ్రీమతి ఏ. సోనీ బాలాదేవి ఐఎఫ్ఎస్, ఎన్ .ప్రకాష్ రెడ్డి ఐపీఎస్, కేంద్ర మాజీ మంత్రి ఎస్ వేణుగోపాల చారి, ఎం రవీందర్ రెడ్డిలు ఈ బృందంలో ఉన్నారు.

మన క్రీడాకారులకు నైతిక మద్దతు అందించడంతోపాటు క్రీడా స్టేడియాల సందర్శన, ఒలంపిక్స్ పోటీలకు చేసిన ఏర్పాట్లు, భవిష్యత్తులో ఒలంపిక్స్ నిర్వహణకు ఉన్న అవకాశాల పరిశీలన, వివిధ దేశాలు క్రీడల్లో అభివృద్ధి సాధించడానికి అనుసరిస్తున్న విధానాలు, పతకాల పట్టికలో వివిధ దేశాలు ముందంజలో ఉండడానికి దోహదం చేస్తున్న కారణాలు పరిశీలించ దానికి తెలంగాణలో అత్యుత్తమ క్రీడా విధానాన్ని ప్రకటించే ముందుకు ఈ క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది.

ఈ పర్యటన ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశిస్తున్న క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై ఉపయోగపడేటట్లు, మన రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి దోహదం చేసే ఆలోచనలకు దారితీస్తుందని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేన రెడ్డి అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement